2017లో భారత్ ఇళ్ళ వేటను ఎలా సాగించింది: మ్యాజిక్ బ్రిక్స్ నివేదిక

2017లో భారత్ ఇళ్ళ వేటను ఎలా సాగించింది: మ్యాజిక్ బ్రిక్స్ నివేదిక

2017లో భారత్ ఇళ్ళ వేటను ఎలా సాగించింది: మ్యాజిక్ బ్రిక్స్ నివేదిక – మొత్తం భారత్‌లో అందరూ ఎక్కువగా కోరుకునే ఆస్థి రియల్ ఎస్టేట్

-2017లో 15 లక్షల మంది కొనుగోలు చేయడానికి ప్రాపర్టీలను చురుగ్గా వెతికారు   

నేషనల్, జనవరి 3, 2018:పారదర్శకతను మరింతగా పెంచేందుకు 2017 సంవత్సరంలో పాలసీలలో అనేక మార్పులు చోటుచేసుకున్నప్పటికీ రియల్ ఎస్టేట్ భారతీయులకు అందరూ కోరుకునే ఆస్థిగానే కొనసాగుతోంది.15 లక్షల మందికి పైగా కొనుగోలుదారులు ప్రాపర్టీ కోసం చాలా చురుగ్గా అన్వేషించారని “2017లో భారత్ ఇళ్ళ వేటను ఎలా సాగించింది” అనే మ్యాజిక్ బ్రిక్స్ నివేదిక పేర్కొంది.

భారతదేశపు నం.1 ప్రాపర్టీ సైట్ మ్యాజిక్ బ్రిక్స్ గత 12 నెలల్లో వినియోగదారుల ప్రవర్తనను విశ్లేషించి, 2017లో భారత్ ఇళ్ళ వేటను ఎలా సాగించింది” అన్న అంశాన్ని పరిశీలించి ఆసక్తికరమైన కన్స్యూమర్ ట్రెండ్స్‌ను గమనించింది. ఆ సంవత్సరంలో వివిధ పాలసీ స్థాయి జోక్యాల అనంతరం రియల్ ఎస్టేట్ బయ్యర్‌లు మార్కెట్‌ను వదిలి వెళ్ళారన్న అపోహను తుడిచి వేసింది.

“2017లో భారత్ ఇళ్ళ వేటను ఎలా సాగించింది” అన్న నివేదిక ప్రకారం దేశం మొత్తంలో ఎక్కువగా ఎంచుకునే ప్రాంతాల్లోని 7 లోకాలిటిలను సొంతం చేసుకుని మహారాష్ట్ర అగ్రస్థానంలో ఉంది. రెంటెడ్ ప్రాపర్టీలలో ఎప్పట్లా న్యూఢిల్లీ విజేతగా నిలువగా నవి ముంబై మరియు హైదరాబాద్‌లు కొనుగోళ్ళలో ముందంజలో ఉన్నాయి.

మ్యాజిక్ బ్రిక్స్ మార్కెటింగ్ హెడ్ ప్రసూన్ కుమార్ సంవత్సరాంతపు సమగ్ర నివేదికపై మాట్లాడుతూ ఇలా అన్నారు. “2017లో భారత్ ఇళ్ళ వేటను ఎలా సాగించింది”

అన్న అద్యయనం ద్వారా మా ప్లాట్‌ఫార్మ్‌పై వినియోగదారుల ఆసక్తి మరియు ప్రవర్తనలు ఎలా ఉన్నాయన్న విషయాన్ని గమనించాం. 2017 సంవత్సరంలో వివిధ పాలసీ స్థాయి జోక్యాల అనంతరం కూడా ప్రాపర్టీల కోసం 15 లక్షలకు పైగా చురుకైన సెర్చ్‌లు జరిగి రియల్ ఎస్టేట్ బయ్యర్‌లు మార్కెట్‌ను వదిలి వెళ్ళారన్న అపోహను తుడిచి వేశాయి. భారతీయులకు రియల్ ఎస్టేట్ అనేది అందరూ కోరుకునే ఆస్థిగానే కొనసాగుతోందని నిరూపించాయి. గత సంవత్సరం ధరలు తగ్గుముఖం పట్టడం, కొద్దిపాటి కొత్త ప్రాజెక్ట్‌ల కారణంగా డిమాండ్ సప్లై సమీకరణం సమానంగా ఉండడం వల్ల గృహ కొనుగోలుదారులు తమ కలల ఇంటిని సొంతం చేసుకోవడానికి ఇదే సరైన సమయం”.

2017లో భారత్ ఇళ్ళ వేటను ఎలా సాగించింది”

నివేదిక మరొక ఆసక్తికరమైన వినియోగదారీ ప్రవర్తనను కనుగొంది. ఏ అంతస్తులో ఇల్లు కొనాలి అనే విషయం దగ్గరి నుండి కొనుగోలుదారులు ప్రాపర్టీ ఎంపిక విషయంలో చాలా ప్రత్యేకమైన అభిరుచులు కలిగి ఉన్నారని నివేదిక తెలుపుతోంది. అన్ని రకాల భవన నిర్మాణాలకు బెంగుళూరు స్వాగతం పలుకుతోంది. ప్రత్యేకమైన ఎంపికల గురించి చెప్పాలంటే హైదరాబాద్, చెన్నై నగరాలు రెసిడెన్షియల్ ఇళ్ళను, ప్లాట్‌లను, విల్లాలను కోరుకుంటున్నాయి. పూనే, నవి ముంబై నగరాలు బహుళ అంతస్తు అపార్ట్‌మెంట్‌లను కోరుకోగా ఢిల్లీ, ఘజయాబాద్ మరియు చెన్నై నగరాలు బిల్డర్ ఫ్లోర్‌లను కోరుకుంటున్నాయి. అహ్మదాబాద్, ముంబై వంటి మెట్రో నగరాలు పెంట్ హౌస్‌లకు అనుకూలంగా ఉన్నాయి.  

కొనుగోలుదారులు పెద్ద ఇళ్ళను కావాలనుకునే ధోరణి పెరుగుతోందని గుర్గావ్ రుజువు చేస్తోంది. అహ్మదాబాద్, గ్రేటర్ నోయిడా, హైదరాబాద్, పూనే వంటి నగరాలు చిన్నగా ఉండే 1000 చ.అడుగుల ప్రాపర్టీలను ఎంచుకుంటున్నాయి. ఇదిలా ఉండగా దేశం మొత్తం మీద ముఖ్యంగా మహారాష్ట్ర మరియు కొల్‌కత నగరాల్లో 500-750 చ.అడుగుల వైశాల్యం ఉండే ప్రాపర్టీలనే కొనుగోలుదారులు అధికంగా వెతికారు.  

ఈ టాప్ మార్కెట్లలోని బయ్యర్లు కేవలం ఇంటి శ్రేణి, పరిమాణాల గురించి మాత్రమే కాదు, అది ఏ అంతస్తులో ఉంది అన్న విషయానికి కూడా చాలా ప్రాధాన్యత ఇస్తున్నారు. ముంబై, నవి ముంబై మరియు థానే వంటి నగరాలు పై అంతస్తుల్లో ఉండడానికి మక్కువ చూపుతుండగా, అహ్మదాబాద్, బెంగుళూరు, కోల్‌కత నగరాలు రెండో అంతస్తును ఎక్కువగా ఎంచుకుంటున్నాయి. కేవలం ఢిల్లీ మరియు చెన్నై నగరాలు మాత్రమే మొదటి అంతస్తును ఎంచుకుంటున్నాయి.   

అంతే కాదు, ప్రాపర్టీలపై ప్రజలు ఎలా పెట్టుబడి పెట్టాలి అన్నది వారి జీవన శైలిపై కూడా ఆధారపడి ఉంది. మ్యాజిక్ బ్రిక్స్ నివేదిక ప్రకారం న్యూఢిల్లీ, నోయిడా, కోల్‌కత వంటి నగరాలు బాచిలర్‌లకు అనుకూలంగా ఉండగా, అహ్మదాబాద్, నవి ముంబై మరియు ముంబై నగరాలు బ్రహ్మచారులకు అంత అనువైనవిగా లేవు. న్యూఢిల్లీ మరియు కోల్‌కత నగరాలు నిస్సందేహంగా మాంసాహారులకు పెద్ద పీట వేస్తుండగా, అహ్మదాబాద్ శాకాహారులకు చక్కని ప్రాంతం. ఇదిలా ఉండగా గుర్గావ్, న్యూఢిల్లీ, నోయిడా నగరాల్లో పెంపుడు జంతువులపై ఎటువంటి ఆంక్షలు లేవు. కానీ చెన్నై, బెంగుళూరు మరియు అహ్మదాబాద్ నగరాలు పెంపుడు జంతువులకు అనుకూలంగా లేవు.  

మేజిక్బ్రిక్స్గురించి : 

మేజిక్బ్రిక్స్.కామ్భారతదేశంలోనంబర్వన్ప్రాపర్టీసైట్. మొత్తం 14 లక్షలకుపైబడినప్రాపర్టీలవివరాలతో , నెలకు 14మిలియన్లకుపైబడినట్రాఫిక్‌తోకొనుగోలుదారులు, అమ్మకందారులుపరస్పరంపారదర్శకంగాతెలుసుకునేఅతిపెద్ద వేదికనుమేజిక్బ్రిక్స్అందిస్తోంది. ఈనేపధ్యంలోసమాచారం, పరిశోధన, ఇతరముఖ్యఅంశాలకుసంబంధించిఎన్నోఆవిష్కరణలుచేయడంద్వారామేజిక్బ్రిక్స్అతిపెద్దదైనవీక్షకులసమూహాన్నిసొంతంచేసుకుంది.