ఇండియాలో విడుదల తేదీని ఖరారు చేసుకున్న ‘హౌ టు ట్రెయిన్ యువర్ డ్రాగన్: ద హిడెన్ వరల్డ్’ !

ఇండియాలో విడుదల తేదీని ఖరారు చేసుకున్న ‘హౌ టు ట్రెయిన్ యువర్ డ్రాగన్: ద హిడెన్ వరల్డ్’ !

~ మార్చ్ 22 న 3D, ఐమ్యాక్స్ మరియు 2D లలో విడుదల కానుంది ~

~ ఇంగ్లీష్, హిందీ, తమిళ్ మరియు తెలుగు భాషలలో విడుదల కానున్న ‘హౌ టు ట్రెయిన్ యువర్ డ్రాగన్: ద హిడెన్ వరల్డ్’ ~

ఫిబ్రవరి 4, 2019, ముంబయి: యూనివర్సల్ పిక్చర్స్ ఇంటర్నేషనల్ అండ్ డ్రీమ్ వర్క్స్ యానిమేషన్లు వారి క్రొత్త అధ్యాయం – హౌ టు ట్రెయిన్ యువర్ డ్రాగన్ : ద హిడెన్ వరల్డ్‌‌లో హికప్, టూత్‌‌లెస్ మరియు వారి అసాధారణ స్నేహాన్ని ప్రకటించడానికి ఉత్సాహంతో ఉన్నారు . ప్రపంచ వ్యాప్తంగా అన్ని వయసుల వారి హృదయాలను కొల్లగొట్టిన ఈ సిరీస్ మూడవ భాగం భారతదేశంలో మార్చ్ 22 న 3D, 2D మరియు ఐమ్యాక్స్ లలో విడుదల కానుంది. ‘హౌ టు ట్రెయిన్ యువర్ డ్రాగన్: ద హిడెన్ వరల్డ్  థియేటర్లలో ఇంగ్లీష్, హిందీ, తమిళ్ మరియు తెలుగు భాషలలో విడుదల కానుంది.

హౌ టు ట్రెయిన్ యువర్ డ్రాగన్ అనేది ఎదుగుదల, అపరిచయస్థులను ఎదుర్కోవాడానికి ధైర్యాన్ని కనుగొనడం…మరియు మిమ్మల్ని ఉపక్ర మించేలా చేయడానికి ఏదీ మీకు శిక్షణ ఎలా ఇవ్వలేదో అనే వాటిని గురించిన ఒక ఆశ్చర్యాన్ని కలిగించే కథ.  యుక్త వయసులోని వికింగ్‌‌కు మరియు భయస్తుడైన నైట్ ఫ్యూరీ డ్రాగన్‌‌ లకు మధ్య అసలు ఊహించని స్నేహం మొదలై వారి జీవితాల్లో కొనసాగే ఒక సాహసంగా తయార వుతుంది.  చలన చిత్ర చరిత్రలోనే అత్యంత అభిమానాన్ని చూరగొన్న యానిమేటెడ్ ఫ్రాంచైజీ యొక్క అత్యద్భుతమైన అధ్యాయానికి స్వాగతం: ‘హౌ టు ట్రెయిన్ యువర్ డ్రాగన్: ద హిడెన్ వరల్డ్.  

 ఆస్ట్రిడ్‌‌తో పాటు బెర్క్‌‌కు నాయకుడు, పరిపాలకుడైన హికప్ అద్భుతమైన మర్మయుక్తమైన డ్రాగన్ యుటోపియాను తయారుచేస్తాడు.  ఉన్న ట్టుండి ప్రత్యక్షమైన ఫీమేల్ లైట్ ఫ్యూరీ వారి గ్రామం అదివరకెన్నడూ ఎదుర్కోని భయంకరమైన భయాన్ని ఎదుర్కొన్నప్పుడు, హికప్ మరియు టూత్‌‌లెస్‌‌లు వారికి తెలిసిన ఒకే ఒక గృహాన్ని విడిచి కేవలం కల్పనలలో మాత్రామే ఉండేదిగా భావించబడే ఒక ప్రపంచానికి ప్రయాణం ప్రారం భి స్తారు.   వారి అసలు గమ్యస్థానాలు ఏంటో తెలిసినప్పుడు, డ్రాగన్‌‌కు రైడర్‌‌కు మధ్య – భూమి అంచులలో- వారు పెంచి వృద్ధి చేసుకున్న నిధిని కాపాడుకోవడానికి యుద్ధం జరుగుతుంది.

‘హౌ టు ట్రెయిన్ యువర్ డ్రాగన్: ద హిడెన్ వరల్డ్  కు, మిగిలిన ముఖ్య పాత్రధారులందరితో పాటు సిరీస్ దర్శకుడైన డీన్ డీబ్లోయిస్ కూడా పు నఃప్రవేశం చేసారు.  దీనికి బ్రాడ్ లూయిస్ (రాటాటౌలీ, ఎఎన్‌‌టిజెడ్) మరియు బోనీ ఆర్నాల్డ్ (టాయ్ స్టోరీ, హౌ టు ట్రెయిన్ యువర్ డ్రాగన్, హౌ టు ట్రెయిన్ యువర్ డ్రాగన్ 2) లు నిర్మాతలుగా వ్యవహరించారు. 

రాటాటౌలీ వంటి చిత్రాల ద్వారా పేరు పొందిన నిర్మాత బ్రాడ్ లూయిస్,  సృజనాత్మకతతో కూడిన ఈ భారీ ప్రాజెక్టులో భాగస్వాములు కావాల్సిందిగా పిలుపునిచ్చారు. “ ప్రేక్షకులను భావోద్వేగానికి లో ను చేసే ఒక నిబద్ధతను మరియు ఇతిహాసాలను సమాన పాళ్ళలో కలిగియున్న ఒక సాహ సోపేత చిత్రాన్నితీయడం ఒక రోమాంచిత అనుభవాన్ని కలిగిస్తుంది”  “మొదటి రెండు డ్రాగన్లకు చక్కటి ఆదరణ లభించిందిఇక ఇప్పుడు ఈ సిరీస్‌‌లో అసలు ఊహించని మరొక క్రొత్త అధ్యా యంలో భాగం అవుతున్నందుకు చాలా ఉత్సాహంగా ఉంది. ఇది డ్రగన్‌‌కోసం వచ్చే క్రొత్తవారిని స్వాఅగతించడమే కాకుండా, దాని వీరాభిమానులందరికీ లోతైన సంతృప్తిని అందించనుంది.”  అని లూయిస్ అన్నా రుఈ చిత్రంలో జే బరూచేల్, అమెరికా ఫెరీరా, కేట్ బ్లాంచెట్, కిట్ హారింగ్‌‌టన్, క్రెయిగ్ ఫెర్‌‌గ్యూజన్, జోనా హ్హిల్, కిర్‌‌స్టెన్ విగ్ మరియు ఎఫ్. ముర్రే అబ్రాహాం‌‌లు నటించారు. 

మార్చ్ 22 మీ సమీప థియేటర్లలో  విడుదలవుతున్న హౌ టు ట్రెయిన్ యువర్ డ్రాగన్ హిడెన్ వరల్డ్ ‌‌లో టూత్‌‌లెస్ మరియు హికప్‌‌లను మరొకసారి కలుసుకోండి.!